వచ్చే ఐదు రోజులూ తస్మాత్ జాగ్రత్త: కుంభవృష్టి ఖాయమంటూ హెచ్చరిక

  • కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు హెచ్చరికలు
  • రాయలసీమ, తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు కూడా
  • ఉరుములు, మెరుపులతో వానలు
తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు, రాయలసీమ, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్గాల కారణంగా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వానలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అల్పపీడన ద్రోణి, క్యుములోనింబస్, ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై పరుచుకుని ఉన్నాయని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుందని, ఆపై వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని, చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు.
Go Back to Shorts
AP
TS
rains
flood

More Telugu News